అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టల్ ఆఫీసర్ అజయ్ సింగ్ చౌహాన్ పోస్టాఫీసు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి


గద్వాల్ ఆర్ సి 18.11.22 జనం సాక్షి.
జోగులాంబ గద్వాల్ కృష్ణానగర్ సబ్ పోస్ట్ ఆఫీస్ లో పోస్టల్ శాఖకు సంబంధించిన పొదుపు పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గద్వాల్ జిల్లా పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అజయ్ సింగ్ చౌహాన్ కోరారు. గద్వాల్ కృష్ణానగర్ సబ్ పోస్టాఫీసు ఆవరణలో బీపీఎం, ఏబీపీఎం,పోస్టల్ ఏజెంట్, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అజయ్‌ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ సుకన్య సంవృద్ధి యోజన, సేవింగ్ డిపాజిట్‌, ఆర్ డి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ వంటి పొదుపు పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రజలకు పోస్ట్ ఆఫీస్ అందుబాటులో ఉంటుంది. మరియు చెల్లింపు యొక్క ప్రతి అవకాశాన్ని అందించడం ద్వారా భవిష్యత్తు కోసం సద్వినియోగం చేసుకోవాలన్నారు. పొదుపు అవకాశాల కోసం ప్రజలు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఓ సూరిబాబు, ఎంఓ సుధాకర్, పోస్ట్‌మాస్టర్‌, బసంతకుమార్‌, తదితరులు పాల్గొన్నారు .