అసీం త్రివేదిపై ”దేశద్రోహం” ఉపసంహరణ

 

ముంబాయి: ప్రజలనుంచి వస్తున్న విపరీతమైన ఒత్తిడి, న్యాయస్థానం విమర్శించడంతో వ్యంగ చిత్రకారుడు అసీం త్రివేదీపై దేశద్రోహం అభియోగాన్ని మహారాష్ట్ర సర్కారు ఉపసంహరించుకుంది. ఈ మేరకు శుక్రవారం ముంబాయి హైకోర్టు తెలియజేసింది. జాతీయ చిహ్నాలను అవమానించారనే ఆరోపణలపై అసీం త్రివేదిపై దేశద్రోహం అభియోగం నమోదైన సంగతి తెలిసిందే కేసును నిశితంగా పరిశీలించిన తర్వాత దేశద్రోహానికి సంబందించి 124(ఎ) కింద కేసు అవసరం లేదనిపిస్తుంది. కాబాట్టి ప్రభుత్వం త్రివేదిపై అభియోగాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. అని అడ్వొకేట్‌ జనరల్‌ డారిన్‌ ఖంబటా న్యాయస్థానానికి తెలిపారు.