అసెంబ్లీ అరగంట వాయిదా
హైదరాబాద్,(జనంసాక్షి): శాసనసభలో నాలుగోరోజు కూడా వాయిదాల పర్వం కొనసాగుతుంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ పలు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మాణాలు తిరస్కరించాడు. దీంతో తెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్‌ఎస్ సభ్యులు పోడియాన్ని ముట్టడించారు. దీంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేసి శాసనసభ పక్ష నేతలు తన ఛాంబర్‌లోకి మీటింగ్‌కు రావాలని కోరారు.