అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు అరెస్టు

హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రాంగణంలో అందోళనకు దిగిన తెరాస, భాజపా, సీపీఐ ఎమ్మెలేలను పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీగేట్‌-1, గేట్‌-2 వద్ద అందోళనకు దిగిన తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, కేటీఆర్‌తో పాటు అపార్టీ ఎమ్మెల్యేలను, భాజపా ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తదితరులతో పాటు, సీపీఐ ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం తెరాస ఎమ్మెల్యేలను గోల్కొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.