అసెంబ్లీ ప్రాంగణంలో భారాస నిరసన

` సీఎం రేవంత్‌ క్షమాపణ చెప్పాల్సిందే..
` బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల డిమాండ్‌
` నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
హైదరాబాద్‌(జనంసాక్షి):బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ పోడియంలోకి దూసుకెళ్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్‌ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అహంకారం నశించాలి అని డిమాండ్‌ చేస్తున్నారు. సబితకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుబట్టారు.ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ కలుగజేసుకుని.. మాజీ మంత్రి సబితా అని పేరు తీసుకోవటంతో ఆమెకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. అయినప్పటికీ స్పీకర్‌.. ఒవైసీ మాటలను పట్టించుకోలేదు. బీఆర్‌ఎస్‌ సభ్యుల నిరసనను ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.