అసెంబ్లీ ముట్టడికి టీడీపీ మద్దతు

హైదరాబాద్‌,(జనంసాక్షి): అసెంబ్లీ ముట్టడికి టీడీపీ తెలంగాణ ఫోరం మద్దతు ప్రటించింది. పార్టీ శ్రేణులంతా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటాయని టి. టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. జేఏసీ స్వంతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని పార్టీలను కలుపుకుని కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తేనే తెలంగాణ సాధ్యమని తెలిపారు.