అసెన్డ్ భూమలు వివరాలు సేకరణ
మెదక్,మార్చి30(జనంసాక్షి): అసైన్డ్ భూములు కొనుగోలు చేసినా, అమ్మినా నేరమని, అలా చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. రెవెన్యూ అంశాలు, ఒత్తిడి నియంత్రణ, వ్యక్తి విలువల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఇష్టపడి పని చేసిన రోజునే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. ఆరు నెలలుగా ఒకే పని చేస్తున్న వీఆర్వోల వద్ద ఇప్పటికి కూడా ప్రాథమిక సమాచారం ఉండడం లేదన్నారు. గ్రామంలో విస్తీర్ణం ఎంత, అందులో పట్టా భూమి ఎంత, అసైన్డ్ భూముల వివరాలు అందబాటులో లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రెవెన్యూ అంశాలపై అవగాహన పెంపొందించేందుకే శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. పాత రికార్డులను పరిశీలించి వాటిలో ఉన్న హెచ్చుతగ్గులను సరి చేయాలన్నారు. సరి చేసిన వాటికి సంబంధించి ప్రొసిడింగ్‌లను రైతులకు ఇవ్వాలని సూచించారు.