అసైన్డ్ భూమిలో అక్రమ వెంచర్

అనుమతులు లేకున్నా దర్జాగా పనులు.
– అధికారులు అడ్డుకున్నా బరితెగించిన అక్రమార్కులు.
– చేతులు ముడుచుకు కూర్చున్న అధికారులు.
పోటో: 1) బెల్లంపల్లి మండలం దుగునేపల్లిలో అసైన్డ్ భూమిలో వేసిన వెంచర్.
2) అసైన్డ్ భూమిగా చూపుతున్న మ్యాప్.
బెల్లంపల్లి, నవంబర్ 1, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గంలో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. భూ కబ్జాలు, అక్రమ వెంచర్లు ఇలా చెప్పుకుంటూ పోతే అంతే లేకుండా పోతుంది. అది బెల్లంపల్లి మండలం దుగునేపల్లి గ్రామం నెన్నెల, బెల్లంపల్లి వేళ్ళ ప్రధాన రహదారి పక్కన రెండేళ్ల కిందట మామిడి తోట ఉండేది. ఆ మామిడి తోటను నరికివేసి మొత్తం చదును చేశారు. మెల్లమెల్లగా మొత్తం భూమిని చదును చేసి వెంచర్ పనులు ప్రారంభించారు. ఇందులో పట్టా భూమి గోరంత ఉండగా అసైన్డ్ భూమి కొండంత ఉంది. దుగునేపల్లి శివారు సర్వే నంబర్ 10, 11 లలో పట్టా భూమి, 29/10 అసైన్డ్ భూమి ఇలా అసైన్డ్ భూమిలో దర్జాగా వెంచర్ వేసేశారు. ఇట్టి వెంచర్ కు ఎలాంటి అనుమతులు లేవని ఇందులో ఎలాంటి క్రయవిక్రయాలు జరుపరాదని అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. అయినా అక్రమార్కులు బరితెగించేశారు. అధికారులు ఏర్పాటు చేసిన బోర్డును తీసి పారేసి మళ్ళీ యధావిధిగా వెంచర్ పనులు పునః ప్రారంభించారు. ఇలా అక్రమార్కులు వెంచర్ పనులు ఆపకుండా తిరిగి చేపట్టడంతో అధికారులు సైతం ఏమి చేయలేక చేతులు ముడుచుకు కూర్చుంటున్నారు. ఇలా అక్రమార్కులు అసైన్డ్ భూముల్లో వెంచర్లు వేసి అమాయకులను నిలువునా ముంచే అవకాశాలు ఉన్నందున వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

తాజావార్తలు