అసైన్డ్ భూములపై లబ్ధిదారులకి పూర్తి హక్కులు పంపించాలి..

టేక్మాల్ జనం సాక్షి అక్టోబర్ 10 మండల కేంద్రంలో తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు.తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివయ్య మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి గత అసెంబ్లీ సమావేశంలో దశాబ్దాల తరబడి అసైన్డ్ భూములు కలిగిన వారికి ఆ అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు వారికే సంక్రమించేలాగా చట్టం తీసుకురావాలని ఇది ఏ ఒక్క పార్టీ నిర్ణయం మాత్రమే కాకుండా అఖిలపక్షం అందరం కలిసి అసైన్డ్ భూములు కలిగి యున్న వారికి మంచి మేలు కలిగేటట్లు గొప్ప నిర్ణయం తీసుకోవలెనని గత అసెంబ్లీ సమావేశంలో సీ.ఎం.ఈ చర్చ లేవనెత్తినారు అన్నారు.మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములున్నాయి. దాదాపు 16,50,000 వేల లబ్దిదారు కుటుంబాలున్నాయి. హైదరాబాద్ రాష్ట్రము భారతదేశంలో విలీనమై స్వేచ్ఛా, స్వాతంత్రోవము అనుభవిస్తూ తేది 17-09-2022 నాటికి 75 సంవత్సరం వత్రోత్సవం జరుపుకుంటున్న ఈ శుభసందర్భంగా  తహసిల్దార్ గారైనా మీరే ఈ విషయములో చొరవ తీసుకుని 1977 చట్టంను రద్దుచేసి అసైన్డ్ భూములు కలిగియున్నవారికి ఆ భూములపై పూర్తి హక్కులు వారికే సంక్రమించేలాగా ఒక కొత్త చట్టం చేయవలసిందిగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగలరని మంత్రివర్యులు,శాసనసభ్యులు,కలెక్టర్,ఆర్డీఓ, దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివయ్య కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు ఉన్నారు.