అసోంలో సోనియా పర్యటన
గౌహతి, ఆగస్టు 13 (జనంసాక్షి):
అసోంలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో యుపిఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ పర్యటించారు. ఆమె వెంట కేంద్ర హోం శాఖమంత్రి సుశీల్ కుమార్ షిండే ముఖ్యమంత్రి తరుణ్ గోగయ్ ఉన్నారు. అల్లర్లు జరిగిన కోక్రాఝార్, డూబ్రి ప్రాంతాల్లో సహాయక శిబిరాల్లో రక్షణ పొందుతున్న బాధితులను వారు పరామర్శిం చారు. ఈ సందర్భంగా సోనియా విలేకరులతో మాట్లాడుతూ బాధితులకు ఆత్మస్థైర్యాన్ని అం దించాల్సిన అవసరం మన ముందుందని అన్నా రు. బాధిత ప్రాంతాలలో పరిస్థితులను చక్కది ద్దాల్సిందిగా ముఖ్యమంత్రికి ఆదేశాలు జారీ చేశా మని, బాధితులకు కూడా పరిస్థితులు చక్కబడిన వెంటనే తమ ప్రాంతాలకు వెళ్ళిపోతామని తనకు తెలియజేసినట్టు సోనియా వెల్లడించారు. ఇదిలా ఉండగా దాదాపు 77మంది మృతి చెంది 4లక్షల మంది నిర్వాసితులైన ఈ అసోం దారుణ మారణకాండ కాంగ్రెస్ పార్టీపై మాయని మచ్చగా మిగిలింది. ఈ ఘటనపై పార్లమెంటు సైతం అట్టడు కిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అస్సాంలో మళ్ళీ ఆ పార్టీ బతికి బట్టకట్టాలంటే ఈ ధారుణ మారణా కాండకు తగిన పరిష్కారం వెతికే ప్రయత్నంలో భాగంగా ఆ పార్టీ అధినేత్రి సోనియా ఈ పర్యటన చేపట్టారు. సహాయక శిభిరాల్లో తలదా చుకున్న నిర్వాసితులను ఆగస్టు 15లోగా స్వగ్రామాలకు వెళ్ళవలసిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినా, బాధితులు వెళ్ళటానికి భయప డుతున్నారు. ఎందుకంటే ఏ క్షణాన తమపై దాడులు జరుగుతాయోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ళు, బళ్ళు కాలిపోయి సర్వం కోల్పోయిన తాము స్వగ్రామాలకు వెళ్ళి ఎక్కడ నివసించాలని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికి 2లక్షల మందికి నిలువ నీడ లేకుండా పోయింది. ఈ బాధితులకు అధినేత్రి సోనియా ఎలాంటి ఓదార్పునిస్తారో వేచి చూడాలి.