అహ్మద్‌పాషా ఖాద్రిని అరెస్టు చేయాలి
కమాలానందభారతిని విడుదల చేయాలి
సంగారెడ్డి, జనవరి 19 : జాతిపిత మహ్మతాగాంధీని అవమానపరిచి దేశద్రోహానికి పాల్పడిన అహ్మద్‌పాషా ఖాద్రిని చట్టపరంగా శిక్షించాలని, కమలానందభారతిని బేషరత్తుగా విడుదల చేయాలని విశ్వహిందుపరిషత్, హనుమాన్‌భక్తబృందం, వాసవీక్లబ్‌లకు చెందిన వారు బైక్‌ర్యాలీ నిర్వహించారు. స్థానిక రాందాస్ చౌరాస్తాలో శివాజీ విగ్రహానికి పూలదండులు వేసి నివాళులు అర్పించారు. జాతికి శివాజి చేసిన సేవలను వారు కొనియాడారు. అనంతరం వారు బైక్‌ర్యాలీ ప్రారంభించి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెల్లి వినతిపత్రం సమర్పించారు. కరీంనగర్‌లో మహ్మద్‌పాషా ఖాద్రి అసెంబ్లీలో మహాత్మాగాంధీ విగ్రహం ఎందుకని రాష్ట్ర, దేశప్రజలను అవమానించిన పాసాఖాద్రిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కమలానందభారతిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. దేశద్రోహులకు సమయం ఇచ్చిన ప్రభుత్వం ఓట్ల రాజకీయం కోసమే కమలానందభారతిని అరెస్టు చేశారని వారు ఆరోపించారు. అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్టుకు కౌంటర్ అరెస్టుగా ప్రజలు చూస్తున్నారని అన్నారు. ఎలాంటి నేరం చేయని కమలానందభారతిని బేషరతుగా విడుదల చేసి హిందు సమాజానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ బైక్ ర్యాలీలో విశ్వహిందుపరిషత్ అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం, హనుమాన్ భక్తబృందం సభ్యులు మహంకాళి అశోక్, వాసవిక్లబ్ అధ్యక్షులు శివనందినారాయణ తదితరులు పాల్గొన్నారు.