ఆందోళన కలిగిస్తున్న చమురు ధరలు: యనమల

అమరావతి,మే30(జ‌నం సాక్షి): పెరుగుతన్న చమురు ధరలు దేశంలో ఆర్థిక ద్రవ్యోల్బణానికి దారి తీసుందని, అలాగే ధరలు పెరుగదల కారణమవుతుందని ఎపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించకుండా సుంకాలు పెంచారన్నారు. దీనివల్ల గత నాలుగేళ్లలో కేంద్రం రూ.5.5లక్షల కోట్లు రాబట్టి, ప్రజలపై భారం వేసిందని తెలిపారు. గత రెండేళ్లలో బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు మూడురెట్లు, బ్యాంకుల్లో మోసాలు నాలుగు రెట్లు పెరిగాయని తెలిపారు. జన్‌ధన్‌ ఖాతాల పేరుతో ప్రజలకు బ్యాంకులంటే భయం పుట్టించారని తెలిపారు. అవినీతిపరులతో బిజెపి కుమ్మక్కయిందన్నారు. రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి, పవన్‌ బిజెపి చేతిలో కీలు బొమ్మలుగా మారారని తెలిపారు. కులాలు మతాలు అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నా రని మహనాడు రాజకీయ తీర్మానంలో పేర్కొన్నారు. . సమర్థ నాయకత్వం రాష్ట్రాల్లో ఉండ కూడదని బిజెపి భావిస్తోందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయాలని చూస్తోందని, రాష్ట్ర పథకాలకు సంబంధించిన పెత్తనం రాష్ట్రాలకే బదిలీ చేయాలని తీర్మానంలో కోరామని అన్నారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రం మెడలు వంచాలన్నారు.