ఆందోళన విరమించిన అగ్రిగోల్డ్ బాధితులు
మంత్రి హావిూతో నేటి చలో సెక్రటేరియట్ విరమణ
గుంటూరు,మే31(జనం సాక్షి): అగ్రిగోల్డ్ బాధితులతో ఆంధప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. దీంతో ఆత్మఘోష పాదయాత్ర పేరుతో శుక్రవారం తలపెట్టిన చలో సచివాలయం కార్యక్రమాన్ని విరమిస్తున్నట్లు అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం ప్రకటించింది. దీంతో రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. వీరి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమించారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని…. బాధితులకు త్వరలో సాంత్వన చేకూరుస్తామని ప్రభుత్వ ప్రతినిధిగా చర్చలకు హాజరైన మంత్రి నక్కా ఆనందబాబు భరోసా ఇచ్చారు. బాధితుల దయనీయ పరిస్థితుల దృష్ట్యా కనీసం 2వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం తాత్కాలికంగా అందించాలని… ఈ మేరకు జూన్ 5న ప్రభుత్వం కోర్టుకు సమర్పించే అఫిడవిట్లో ఈ విషయాన్ని పొందుపర్చాలని బాధితుల సంక్షేమ సంఘం కోరింది. ప్రభుత్వం ఎప్పటిలోగా ఆర్థిక సహకారం అందించేది నిర్దిష్టంగా చెప్పాలని బాధితుల సంఘం డిమాండ్ చేయగా…. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి హావిూ ఇచ్చారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని, మంత్రివర్గంలో దీనిపై చర్చ జరపనున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు పరిహారం, అగ్రిగోల్డ్ బాధితుల వివరాల సేకరణ వంటి పక్రియను ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేసిన మంత్రి…. సమస్య పరిష్కారం ప్రభుత్వం వల్లే సాధ్యమని చెప్పారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్, పవన్ ఈ అంశంపై రాద్ధాతం చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.మంత్రి ఆనందబాబు హావిూతో శాంతించిన అగ్రిగోల్డ్ బాధితులు దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావుకు మంత్రి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి రామకృష్ట, ప్రత్యేక¬దా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు