ఆంధోల్‌లో రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి
మెదక్: మెదక్ జిల్లా ఆంధోల్ మండలం కిచ్చన్నపల్లి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రూజర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి… క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రిలో ప్రాధమిక చికిత్స తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని… మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో వారిని హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.