ఆకట్టుకుంటున్న ఎగ్జిబిషన్‌

ఖమ్మం, జనవరి 28 (): ఖమ్మం పట్టణంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. సాయంత్రం వేళ సరదాగా గడపాలనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. ఎంతో అందమైన ఇండియాగేట్‌, కోలంబస్‌, బ్రేక్‌డ్యాన్స్‌ ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. 80 అడుగుల ఎత్తులో జెయింట్‌విల్‌లో విహరిస్తూ నగరాన్ని వీక్షించవచ్చు. కార్లు, మోటారుసైకిల్‌ తదితర వస్తువులు చిన్నారులను ఆకర్షిస్తున్నాయి. మహిళలకు బెంగాళి చీరలు, కశ్మీర్‌ చీరలు, రాజస్థాన్‌ వస్త్రాలు అమ్మకానికి ఉంచారు.