ఆకట్టుకొన్న జిల్లా స్థాయి జానపద నృత్య పోటీలు

నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో అక్టోబర్ 20 జనం సాక్షి:
గురువారం పట్టణ కేంద్రంలోని నేషనల్ హైస్కూల్లో జిల్లా సైన్స్‌ అధికారి కృష్ణారెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి జానపద నృత్య పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సెక్టోరల్ అధికారి సతీష్ కుమార్ పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపికైన విజేతలకు బహుమతులు అందజేశారు.
ఆయన మాట్లాడుతూ మానవాళి ప్రయోజనం కోసం సైన్స్‌ అండ్‌ టెక్నా లజీ ఆవశ్యకతను పాటలు, నాటికల రూపంలో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుందన్నారు. జానపద నృత్యరూపకంలో
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంద్రకల్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక
మొదటి స్థానం, జడ్పిహెచ్ఎస్ ఇంద్రకల్ తాడూరు మండల విద్యార్థులు ద్వితీయ స్థానం, జడ్పీహెచ్ఎస్ పెద్దపల్లి తెలకపల్లి మండలం తృతీయ స్థానం, జడ్పిహెచ్ఎస్ తెలకపల్లి ప్రథమ స్థాయిలో నిలిచిన జడ్పిహెచ్ఎస్ ఇంద్రకల్ తాడూరు మండల విద్యార్థులు ఈనెల 28వ తేదీన రాష్ట్రస్థాయిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలు పాల్గొననున్నారు.
దృశ్యరూపంలో సందేశాత్మకంగా ప్రదర్శించిన విద్యార్థుల ప్రతిభను అభినందించారు. న్యాయనిర్ణేతలుగా సురేష్ బాబు మురళీధర్ సత్యం వ్యవహరించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవి, వివిధ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.