ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 19 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఇందుర్తీ గ్రామంలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు గోపికమ్మ, కృష్ణుని వేషధారణలో పాఠశాలలో సందడి చేశారు. విద్యార్థినీ విద్యార్థులు కోలాటాలు, నృత్యాలు చేశారు. చిన్ని కృష్ణుని వేషధారణలో చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమం అందర్నీ ఆకట్టుకుంది. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అప్పాల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.