ఆటలను ప్రోత్సహించేందుకే క్రీడా ప్రాంగణాలు ఎమ్మెల్యే పెద్ది
ఆటలను ప్రోత్సహించేందుకే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మండలంలోని రాగంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణప్రాంతాల్లోని యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు, యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని సూచించారన్నారు అన్నారు.అందులో భాగంగా ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ప్రతి గ్రామపంచాయతీలో,క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. క్రీడా ప్రాంగణాలను యువత సద్వినియోగం చేసుకుని క్రీడా రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే,ప్రజా ప్రతినిధులతో కలిసి వాలీబాల్ ఆడారు.ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ఓ డి సి ఎం ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, జడ్పిటిసి బత్తిన స్వప్న శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ ఐలయ్య, ఉప సర్పంచ్ రవీందర్, తాసిల్దార్ సుభాషిని, ఎంపీడీవో సుమన వాణి, ఎం పి ఓ పర్వీన్, పంచాయతీ కార్యదర్శి వరుణ్,వార్డు మెంబర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.