ఆటోను కారు ఢీ:ఆరుగురు కూలీలకు గాయాలయ్యాయి

rl1lujenనల్గొండ : జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామన్నపేట వద్ద జరిగిన ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటన మరిచిపోకముందే నార్కట్ పల్లిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆటోను కారు ఢీకొనడంతో ఆరుగురు కూలీలకు గాయాలయ్యాయి. వీరందరీ పరిస్థితి నిలకడగా ఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే అని తెలుస్తోంది.
కొంతమంది పత్తి కూలీలు గురువారం ఉదయం ఆటోలో వెళుతున్నారు. నార్కట్ పల్లి ప్రాంతం వద్దకు చేరుకోగానే సడెన్ గా ఆటో డ్రైవర్ బ్రేక్ వేశారు. వెనుక నుండి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీనితో ఆటోలో ఉన్న ఆరుగురు కూలీలకు గాయాయ్యాయి. వెంటనే వీరిని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. కానీ ఓ వృద్ధుడు కాలి మాత్రం విరిగింది.