ఆటో కారుఢీ…ఏడుగురికి గాయాలు

హత్నూర: ఆటో కారు ఢీకోనడంతో ఏడుగురు కూలీలకు గాయాలైన సంఘటన సోమవారం ఉదయం హత్నూరులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..మండల పరిధిలోని మాధూర గ్రామానికి చెందిన కూలీలు ఆటో లో దౌలాబాద్‌ పనికి వెళ్తున్నారు.హత్నూర నుంచి ఐటీఐ కాలని వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి బలంగా ఆటోను డీకోట్టడంతో అందులో ప్రయాణీస్తున్న దశరథ,దత్తయ్య,లలిత,పెద్దలలిత,సునీత,వెంకటమ్మగారి దత్తమ్మ,పార్వతమ్మకు గాయాలయ్యాయి.వీరిని మరో ఆటోలో ఆస్పత్రికి తరలించారు.ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది.