ఆడపడచుల ఆనందం కోసమే..
బతుకమ్మ చీరల పంపిణి.
– ఎంపీపీ బక్క రాధజంగయ్య.
ఊరుకొండ, సెప్టెంబర్ 26 (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ ఆడపడుచుల ఆనందం కోసమేనని ఎంపీపీ బక్క రాధజంగయ్య అన్నారు. సోమవారం ఊరుకొండ మండల కేంద్రంతోపాటు మండలంలోని ముచర్లపల్లి, రాంరెడ్డి పల్లి, బొమ్మ రాజు పల్లి, జగబోయినపల్లి గ్రామపంచాయతీ లలో ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎంపీపీ బక్క రాధజంగయ్య ముఖ్యఅతిథిగా హాజరై ఆయా గ్రామాల ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ బక్క రాధజంగయ్య మాట్లాడుతూ.. మనసున్న నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ పండుగ అని అన్నారు. అడపడచులు సంబురంగా బతుకమ్మ పండగ జరుపుకుంటారని, పేదింటి పండుగ సంబురంగా జరగాలని, రెక్కాడితే డొక్కాడని కుటుంబాల్లో సంతోషం నింపాలని పండక్కి బతుకమ్మ చీరలు ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారన్నారు. అడబిడ్డలు సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట నాయకులు ముచర్ల జనార్దన్ రెడ్డి, గిరి నాయక్, వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి, తెరాస మండల టిఆర్ఎస్ అధ్యక్షులు వీరారెడ్డి, ఎంపిటిసిలు గోపాల్ గుప్తా, అమరేశ్వర్ రెడ్డి, కో ఆప్షన్ కలీం పాషా, సర్పంచులు కొమ్ము రాజయ్య, పర్వతరెడ్డి, శివరాణి హరీష్, బోయ లక్ష్మమ్మఅంజయ్య, కవిత మణిపాల్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు బచ్చలకూర రమేష్, మేకల శ్రీనివాసులు, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు నరేష్, జయరాం గౌడ్, ఉప సర్పంచ్ లు నారాయణ, పావని జగదీష్, పరశు రాములు, నాయకులు కొమ్ము శీను, బండి మల్లేష్, సందీప్ కుమార్, మాజీ సర్పంచ్ శేఖర్, ఎంపీవో వెంకటేశ్వర్లు, అర్ ఐ రాఘవేందర్, ఆయా గ్రామాల ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.