ఆడపడుచులకు ఆత్మీయతతో బతుకమ్మ చీరలు.
మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కల చక్రపాణి. హి
రాజన్నసిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 20, (జనం సాక్షి). ఆడపడుచులకు ఆత్మీయతతో పండగ కానుకగా బతుకమ్మ చీరలు అందిస్తోందని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి అన్నారు. మంగళవారం పట్టణంలోని 24 వ వార్డు రాజీవ్ నగర్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా సిరిసిల్ల నేతలకు ఉపాధి కల్పించేందుకు బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఆడపడుచులకు నచ్చేలా 30 రంగులలో 240 రకాల డిజైన్లలో ఆడపడుచులకు చీరలు అందుబాటులోకి తేవడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రత్యేకతను చాటే బతుకమ్మ పండుగ లో ఆడబిడ్డల సంతోషం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆత్మీయతతో చీరలు పంపిణీ చేస్తుందని తెలిపారు.. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు చిందం చక్రపాణి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, స్థానిక కౌన్సిలర్ బుర్ర లక్ష్మి పలువురు కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు మహిళలు పాల్గొన్నారు