ఆడపిల్లలను కాపాడుకుంటున్న అఫ్ఘన్లు


కాబుల్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): తాలిబన్లు 20 ఏళ్ల క్రితం ఎలాంటి అరాచకరాలు సాగించారో తిరిగి ఇప్పుడు వాటినే కొనసాగిస్తున్నారు. దీంతో తాలిబన్ల మాటలను ఆఫ్ఘన్లు నమ్మడం లేదు. కాబుల్‌ ఏ చిన్న నిరసన తెలిపినా కాల్చి పారేస్తున్నారు. తాలిబన్‌ వ్యతిరేకుల విగ్రహాలను నిలువునా కూల్చేస్తున్నారు. దీంతో అఫ్ఘన్లు భయపడి ఇళ్లలోనే దాక్కుంటున్నారు. అలాగే తమ ఇంటిలోని ఆడపిల్లు తాలిబన్ల కండపడకుండా దాచేసుకుంటున్నారు. గతంలో తాలిబన్లు పది, పన్నెండేళ్లు దాటిన ఆడపిల్లలు కనిపిస్తే లాక్కెళ్లిపోయి అత్యాచారాలకు పాల్పడేవారు. ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉండటంతో అఫ్ఘన్లు భయంభయంతో కాలం గడుపుతున్నారు.