తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తాం ` జనసేన

హైదరాబాద్(జనంసాక్షి): రాబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే ప్రారంభించినట్లు ఆ పార్టీ వెల్లడిరచింది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నప్పటికీ సాధ్యమైనన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొంది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న జనసైనికులు, వీర మహిళలు ఈ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని జనసేన పార్టీ పిలుపు నిచ్చింది.


