రేటింగ్‌ కోసం దుష్ప్రచారాలు ఆపండి

` మహిళా ఐఏఎస్‌పై అసత్యవార్తలు దురదృష్టకరం
` సినిమా టికెట్‌ ధరల పెంపునకు నేను అనుమతి ఇవ్వలేదు
` ఆ ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశాను
` హైదరాబాద్‌`విజయవాడ హైవేపై ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో గతంలోనూ, ప్రస్తుతం సినిమా టికెట్‌ ధరలు పెంచేందుకు తాను ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన పలు అంశాలపై విలేకరులతో మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా వస్తున్న సినిమా టికెట్‌ ధరల పెంపు అంశంపై విలేకరులు ఆయన్ని ప్రశ్నించారు. ఇందుకు ఆయన సమాధానమిస్తూ సినీ ఇండస్ట్రీని పట్టించుకోవడం మానేశానని తెలిపారు.‘‘సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశాను. ‘పుష్ప2’ తర్వాత బెనిఫిట్‌ షోలు, సినిమా టికెట్‌ ధరలను పెంచమని నా వద్దకు రావొద్దని చెబుతూనే ఉన్నా. ఆ మధ్య వచ్చిన రెండు సినిమాలు, తాజాగా వచ్చిన సినిమా, సంక్రాంతికి రాబోయే చిత్రాలకు సంబంధించి ఏ ఫైలూ నా దగ్గర రాలేదు. అప్లికేషన్‌ పెట్టుకోవద్దని నేనే చెబుతున్నా. నన్ను ఎవరూ కలవడం లేదు. సంధ్య థియేటర్‌ ఘటనలో ఒక మహిళ చనిపోయింది. ఎందుకు పరిష్మన్‌ ఇచ్చానా?అనిపించింది. సంఘటన జరిగిన వెంటనే ఆస్పత్రి వాళ్లు, డీఎంహెచ్‌వో తదితరులతో మాట్లాడి, ప్రతీక్‌ ఫౌండేషన్‌ తరపున రూ.25లక్షల చెక్‌ ఇచ్చాను. అప్పటికి నిర్మాత కూడా ఎవర్ని పంపలేదు. ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కావాలంటే ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ప్రమాదంలో గాయపడిన అబ్బాయిని పెంచి, చదివిస్తానని ఆ తండ్రికి హావిూ కూడా ఇచ్చాను’’ఇక తెలంగాణలో బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరలు పెంచబోమని ఆ మరుసటి రోజే అసెంబ్లీలో చెప్పాను. ఆ మాటకు కట్టుబడి ఇప్పటివరకూ ఒక్క సంతకం కూడా పెట్టలేదు. నల్గొండకు సంబంధించిన అభివృద్ధి పనులు చూసుకుంటూ, వాటిని సవిూక్షించుకుంటూ రాత్రే వచ్చాను. నేను సినిమా పరిశ్రమపై దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు పరిష్కరించాలని కార్మికులు వస్తే, పేద కళాకారుల విషయంలో మాత్రమే నేను జోక్యం చేసుకున్నా. అంతే తప్ప, రేట్లు, బెనిఫిట్‌లకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదు. టికెట్‌ ధరల పెంపు గురించి వస్తున్న జీవోలకు నాకు ఎలాంటి సంబంధం లేదు’’ అని అన్నారు.
మహిళా ఐఏఎస్‌పై దుష్ప్రచారం దురదృష్టకరం: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్‌: మంత్రులపై ఇటీవల వస్తున్న ఆరోపణల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండిరచారు. ఓ మహిళా ఐఏఎస్‌పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా రాతలు రాయొద్దని మంత్రి హితవు పలికారు. మంత్రి హైదరాబాద్‌లో విూడియాతో మాట్లాడారు.‘నా జిల్లాలోనే కాదు.. చాలా జిల్లాల్లో కలెక్టర్ల బదిలీ జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతుంది. అధికారుల విూద అభాండాలు వేయడం సరికాదు. రేటింగ్‌లు, వ్యూస్‌ కోసం అవాస్తవాలు రాయడం సరికాదు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దు. మంత్రులపైనే కాదు.. సీఎంపైనా దుష్ప్రచారం చేస్తున్నారు’ అని కోమటిరెడ్డి అన్నారు.
హైదరాబాద్‌`విజయవాడ హైవేపై ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం
సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్‌`విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. వంతెనల నిర్మాణం జరుగుతున్న చోట యంత్రాలు కూడా తొలగించినట్లు తెలిపారు. ఈ అంశంపై మంత్రి హైదరాబాద్‌లో విూడియాతో మాట్లాడారు.‘‘నేషనల్‌ హైవేల డైరెక్టర్‌తో ఇప్పటికే మాట్లాడాను. టోల్‌ప్లాజాల వద్ద రద్దీ పెరిగితే టోల్‌ వసూలు లేకుండా పంపించాలని చెప్పాం. రోడ్లపై వాహనాలు ఆగిపోతే.. వెంటనే తొలగించేందుకు హైవేపై క్రేన్లు సిద్ధంగా ఉంచాం’’ అని మంత్రి తెలిపారు.

మహిళా ఐఏఎస్‌లపై తప్పుడు కథనాలు తగవు
` ఇలాంటి కథనాలతో ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు
` టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శలు
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణకు చెందిన మహిళా ఐఏఎస్‌ అధికారిపై ఓ విూడియాలో తప్పుడు కథనాలు ప్రసారమ వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. వ్యక్తుల ప్రైవేట్‌ జీవితాలపై చర్చ చేయడం బాధాకరమని అన్నారు. వాస్తవానికి దూరంగా కథనాలు వస్తున్నాయని ఆగ్రహించారు. ఎంతో కష్టపడితే తప్ప మంత్రులు ఈ స్థాయికి చేరుకోరని.. అలాంటి వారిపై విూడియా సంస్థలు నిరాధారమైన వార్తలను ప్రచురించడం మానేయాలని విజ్ఞప్తి చేశారు. శనివారం గాంధీభవన్‌లో విూడియాతో మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడారు. శ్రీరాముడికి బీజేపీలో సభ్యత్వం ఉందా? అని ప్రశ్నించారు. రాముడి పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎక్కడిదని నిలదీశారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగడం మంచిది కాదని హితవు పలికారు. ఓట్ల కోసం దేవుడిని వాడుకోవడం సరికాదని చెప్పుకొచ్చారు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌. ’కేసీఆర్‌ పదేళ్ల పాలనలో తెలంగాణా యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీఆర్‌ఎస్‌ నేతలు శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మేం రెండేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో శ్వేతపత్రం విడుదల చేస్తాం. కేసీఆర్‌ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. కవిత వ్యవహారంతో కేటీఆర్‌, హరీశ్‌రావు బాధపడుతున్నారు. కేసీఆర్‌ కుటుంబ అవినీతి బాగోతంపై కవిత నిజాలు చెబుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుస్తాం, పంచాయతీ ఎన్నికల్లో 70 శాతం స్థానాలు గెలిచాం. కంటోన్‌మెంట్‌, జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో గెలిచాం. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకోవాలనే తపన ప్రజల్లో కనిపిస్తోందన్నారు. పేర్లు మార్చడం వల్ల ప్రజలకు వచ్చేదేవిూ లేదు. పేర్ల మార్పునకు ముందు ఆయా జిల్లాలకు ఏమేం చేశారో చెప్పాలి. ప్రజల దృష్టి మళ్లించేందుకే పేరు మార్పు అంశాన్ని తెరపైకి తెస్తున్నారు’ అని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు.