ఆడపిల్ల లేనిది సృష్టి లేదు.. -డాక్టర్ అనితా రెడ్డి
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 11(జనం సాక్షి)
ఆడపిల్ల లేనిదే సృష్టి లేదని, ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అని నేటి ప్రంపంచంలో ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందంజలో ఉంటున్నరని వారి అభ్యున్నతికి తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా ప్రోత్సాహం అందించాలని అనితా రెడ్డి అన్నారు ఈరోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ హన్మకొండ వారి ఆద్వర్యంలో పడిశాల వీరభద్రయ్య ఆంధ్ర బాలికల హై స్కూల్ లో ఏర్పాటు చేసిన కార్యములో డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిథిగా మరియు గెస్ట్ స్పీకర్ గా విచ్చేసి మాట్లాడుతూ అన్ని రంగాల్లో ఆడపిల్లలు ఎదగాలని వారు వినడం నుండి మాట్లాడి, చర్చించి తన ఆలోచనలను ఆచరణలో పెట్టే స్తాయికి, తమ హక్కులను తమ అభివృద్ధికి ఉపయోగించుకునే స్తాయికి చేరాలని అన్నారు, 1) జువెనల్ జస్టిస్ ఆక్ట్ 2) గుడ్ టచ్ బ్యాడ్ టచ్, 3) పౌష్టికాహార విలువలు, విద్యా విలువలు, గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ తదితర అంశాలపై పిల్లలకు డాక్టర్ అనితా రెడ్డి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం లో రోటరీ క్లబ్ ప్రసిడెంట్ నరేష్, వేణు, గోలి రవి, శారద, టీచర్స్ పాల్గొన్నారు అనంతరం పిల్లలకు సానిటరీ నాప్ కిన్స్, సబ్బులు ఉచితముగా అతిదుల చేతుల మీదుగా అందించారు.