ఆడబిడ్డలకు సర్కారు సారె..
కానుకలు అందుకొని మురిసిపోయిన మహిళలు
మొండిగౌరెల్లి సర్పంచ్ బండిమీది కృష్ణ మాదిగ
గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసా క్షి) :- ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వు కోసమే ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదని మొండిగౌరెల్లి గ్రామ సర్పంచ్ బండిమీది కృష్ణ మాదిగ అన్నారు. బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆడపడుచులందరికి ఎంపీటీసీ తాండ్ర లక్ష్మమ్మ, ఉపసర్పంచ్ మేకల యాదగిరి రెడ్డితో కలసి బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ.. వారి అభివృద్ధి పథకాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమూచిత స్థానాన్ని కల్పిస్తుందాన్నారు. ఈ బతుకమ్మ పండగను మహిళలందరు సమిష్టిగా, సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపిట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గుర్రం బాలమణి, Vo1కట్టెల జంగయ్య, VO2విజయ లక్ష్మి, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Attachments area