ఆడబిడ్డల రాకతో ఊరంతా పండుగే

భీమదేవరపల్లి మండలం జూలై (7) జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి మండలం
రాంనగర్ గ్రామంలో బొడ్రాయి, భూలక్ష్మి శ్రీ లక్ష్మి, ఆంజనేయ విగ్రహాల స్థిర ప్రతిష్ట కార్యక్రమం గత మూడు రోజులుగా కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ సందర్భముగా గ్రామంలోకి ప్రతి ఇంటిలో ఆడబిడ్డల రాకతో ఊరంతా పండుగ వాతావరణం కన్పిస్తుంది. భూధాత పి.వి మనుమడు విజర్ కశ్యప్ గుడి నిర్మాణ దాత కావేరి సీడ్స్ అధినేత గుండవరపు వనజభాస్కర్ రావు దంపతులు ఆదివారం నాడు జరిగిన కార్యక్రమంలో భాస్కర్రావు పాల్గోని ప్రసంగిస్తూ ప్రజల అభిష్టాం మేరకు ప్రభుత్వ స్కూల్ను కార్పోరేట్ స్థాయికి తీర్చిదిద్దామని అదేవిధంగా ఇంటర్ , డిగ్రీ కళాశాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటించారు. అనంతరం. భాస్కర్రావుని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కావేరీ సీడ్స్ రీజనల్ మేనేజర్ పామెర సుమన్ రావు, జక్కుల రమేష్ యాదవ్ సిఐ శ్రీనివాస్ ఎస్ఐ మౌనిక రెడ్డి సర్పంచ్ భూక్య కవిత, తిరుపతి  ఉపసర్పంచి కదిరే ఐలయ్య ఉత్సవ కమిటీ అధ్యక్షులు కనుకం నరేష్  మాజీ సర్పంచ్ పార్నందుల వెంకటయ్య పిట్టల ఐలయ్య గ్రామ ప్రజలు భక్తులు అందరు పాల్గొన్నారు