ఆడ‌పిల్ల అయితే నే బిల్‌

hqdefaultఅహ్మదాబాద్ : ఆడ పిల్ల పుడితే ఆ ఆస్పత్రిలో బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు. సమాజంలో రోజు రోజుకు ఆడ పిల్లల సంఖ్య తగ్గిపోతున్న కారణంతో అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రి ఈ వెసులుబాటు కల్పించింది. అమ్మాయి పుట్టిందని తెలియగానే తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. ఏ చెత్త కుప్పలో.. చెట్ల పొదల్లో.. రోడ్లపైన ఆడ శిశువులను వదిలేస్తున్న క్రమంలో.. అటువంటి వారికి బాసటగా నిలిచేందుకు సింధు ఆస్పత్రి ముందుకొచ్చింది. ఆడ శిశువు పుడితే ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఆస్పత్రి స్పష్టం చేసింది. అమ్మాయి పుట్టిన వెంటనే వేడుకలు కూడా నిర్వహిస్తోంది ఆస్పత్రి. ఆడ శిశువులను కాపాడుకోవాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం 1000 మంది బాలురకు 890 మంది అమ్మాయిల రేషియో ఉంది.