ఆత్మకూరు లో జరుగు ఏఇటియుసి జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కరపత్రం విడుదల
ఆత్మకూరు లో జరుగు ఏఇటియుసి జిల్లా మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు శ్రీ రామ్ పెబ్బేరు లో కరపత్రం విడుదల చేశారు. ఏఐటీయూసీ కార్యాలయంలో నవంబర్ 16, 17 తేదీలలో ఆత్మకూరులో జరగనున్న ఏఐటియుసి జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేసి, కార్మికుల ఉద్దేశించి ఆయన మాట్లాతు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికుల భద్రత కల్పించడం లేదన్నారు దశాబ్దాలుగా పోరాడి కార్మికులు సాధించుకున్న హక్కులకు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు స్వేచ్ఛ వ్యాపారం పేరుతో శ్రమ దోపిడీ చేస్తుందన్నారు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మికులకు హక్కులు లేకుండా చేశారన్నారు 1886లో పోరాడి సాధించుకున్న రోజుకు 8 గంటల పని కాలాన్ని 12 గంటలకు పెంచే కుట్ర చేస్తోందని పేర్కొన్నారు ఎర్రజెండా మాత్రమే అండగా ఉంటుందన్నారు హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు ,స్వీపర్లకు, మిషన్ భగీరథ వర్కర్లకు 26000 కనీస వేతనం ఇవ్వాలన్నారు. ప్రమాద బీమా, ఆరోగ్య భీమా, ట్రావెలింగ్ అలవెన్సులు, ఐడెంటిటీ కార్డులు, ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. జిల్లా 14 మండలాల ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాల హమాలీ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, స్వీపర్లు, కట్టే కోత మిషన్ కార్మికులు ,మిషన్ భగీరథ స్కీం వర్కర్లు, హాస్పిటల్ వర్కర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల హమాలీలు, మార్కెట్ యార్డుల హమాలీలు తదితర రంగాల కార్మికులందరూ ఆత్మకూరులో జరిగే ఏఐటీయూసీ జిల్లా మహాసభలకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. జిల్లా లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కారానికి భవిష్యత్తు పోరాట ప్రణాళికను జిల్లా మహాసభలు రూపొందించడం జరుగుతుందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ ఎస్ బోస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహ ముఖ్య అతిథులుగా మహాసభల్లో పాల్గొంటారన్నారు నవంబర్ 16 వ తేదీ 11 గంటలకు ఆత్మకూరు మండల కేంద్రం మార్కెట్ యార్డ్ నుంచి ర్యాలీ ప్రారంభమై ఎంజి గార్డెన్ ఫంక్షన్ హాల్ కు చేరుకుంటుందన్నారు అక్కడ ఏఐటీయూసీ అరుణ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, బహిరంగ సభ ఉంటుందన్నారు. ఏఐటీయూసీ నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులను కార్యవర్గాన్ని ఎన్నుకుంటారన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పెద్ద మొగులయ్య, బిక్ష రాములు, రాజు, ఈర్లదిన్నె కృష్ణయ్య , పాపన్న , బతుకుల రాముడు, రామకృష్ణ, షుగర్ రాములు ,గొర్ల వెంకటయ్య, సహదేవుడు తదితరులు పాల్గొన్నారు.