ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ప్రముఖులు
జనంసాక్షి/చిగురుమామిడి – సెప్టెంబర్ 21:
అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రెస్ మిత్రులు ఐజెయు బుధవారం మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలోని శ్రీఓదెల మల్లికార్జున స్వామి కొండ వద్ద సరదాగా గడిపారు. మండలంలోని పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.టియుడబ్ల్యూజే (ఐజే యు) కరీంనగర్ జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఇటీవల ఎన్నికైన జేరిపోతుల వెంకటస్వామిని శాలువాతో సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. మండల అభివృద్ధికి అందరూ తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస జిల్లా పార్టీ నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణ రెడ్డి, తహసిల్దార్ సయ్యద్ ముబీన్ అహ్మద్,ఎంపీడీవో మామిడిపల్లి నరసయ్య, మండల పరిషత్ సూపరిండెంట్ ఖాజా మొయినొద్దీన్, పత్రికా మిత్రులు బుర్ర పరిశరాములు గౌడ్ (ఈనాడు), జేరిపోతుల వెంకటస్వామి (ఆంధ్ర జ్యోతి), మార్త ప్రకాష్ (నమస్తే తెలంగాణ) పత్తెం రమేష్ పటేల్ (మన తెలంగాణ) రాకం కరుణాకర్ (దిశ), శేషం నరసింహచార్యులు (మనం), చిట్టెంపల్లి శ్రీనివాస్ (జనతా మానేరు ),బోలుమల్ల రాజమౌళి (ప్రజాపక్షం), జేరిపోతుల సదానందం (సూర్య),జీడి నగేష్ (మైత్రి), ముడికే కనుకయ్య (తెలంగాణ రిపోర్టర్)తల్లా నరేష్ (ప్రజాతంత్ర), వేల్పుల క్రాంతి కుమార్ (నవతెలంగాణ) ఎనగందుల అశోక్ (నిజం), మారుపాక రమేష్ (ప్రజాసాక్షి ) తదితరులు పాల్గొన్నారు.