ఆదర్శ పాఠశాలలో కుల వివక్షత…

డిఈతో కలిసి మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన జాతీయ ఆహార భద్రత కమీషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, భారతీదేవి

మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఇష్టానుసారంగా వ్యవహారం
తరగతి గదులలో నిల్చోబెట్టి కులాల వారిగా అటెండెన్స్
▪️పురుగుల అన్నం నిజమే..
▪️రుచికరంగా లేని కూరలు
▪️మోకాళ్ళ మీద కొడుతున్న పిఈటీ
▪️కమీషన్ సభ్యుల ముందు విద్యార్థుల
ఆవేదన…

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 24:
మధ్యాహ్న భోజనంలో తెల్లపురుగులు, నీళ్ల చారు వల్ల విద్యార్థులు భోజనం చేయడం లేదంటూ ములుకనూర్ మాడల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం రోడ్డు పై ఆందోళనకు దిగిన విషయానికి స్పందనగా శనివారం డీఈవో జనార్ధన్ రావు తో కలిసి జాతీయ ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరుగంటి ఆనంద్, భారతీదేవి మాడల్ స్కూల్ ను తనిఖీ చేశారు. తరగతి గదులకు వెళ్ళి విద్యార్థులను విచారిస్తుంటే విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. ప్రతి తరగతి గదిలో రోజు ఉదయం కులాల వారీగా విద్యార్థులను నిల్చోబెట్టి అటెండెన్స్ తీసుకున్న అనంతరం కులాల వారీగా హాజరైన విద్యార్థుల సంఖ్యను బ్లాక్ బోర్డు మీద వెల్లడిస్తున్న దృశ్యం చూసి కమీషన్ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. తరగతి గదులలో విద్యార్థుల కుల వివక్షత విని నిర్ఘాంతపోయారు. పురుగుల అన్నం నిజమే అంటూ ఈరోజు మధ్యాహ్న భోజనంలో కూడా పురుగులు వచ్చాయంటూ, కూరలు రుచికరంగా ఉండడం లేదంటూ కమీషన్ సభ్యుల ముందు విద్యార్థులు వాపోయారు. పిఈటీ మేడమ్ తమను మోకాళ్ళ మీద కొడుతుందంటూ విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. మూత్రశాలలు పరిశుభ్రంగా ఉండవని, తరగతి గదులలో ఫ్యాన్లు కూడా పనిచేయడం లేదంటూ కమీషన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు

భాద్యులపై చట్టపరమైన చర్యలకు సిఫారసు
కమీషన్ సభ్యులు వోరుగంటి ఆనంద్, భారతీదేవి…

మాడల్ స్కూల్ తనిఖీ చేయడానికి వచ్చిన తమకు నివ్వెరబోయే నిజాలు వెల్లడయ్యాని కమీషన్ సభ్యులు తెలిపారు. తరగతి గదులలో కులాల వారిగా అటెండెన్స్ తీసుకుంటున్న విషయాన్ని విద్యార్థులు తమ దృష్టికి తీసుకువచ్చారని, పురుగుల అన్నం నిజమే అంటూ, రుచికరమైన కూరలు వండడం లేదని, మూత్రశాలలు పరిశుభ్రంగా ఉండవని విద్యార్థులు తమతో చెప్పారన్నారు. పిఈటీ మేడమ్ తమను మోకాళ్ళ మీద కొడుతుందంటూ విద్యార్థినిలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని కమీషన్ సభ్యులు వివరించారు. వంటమనుషులను మార్చాలని విద్యార్థులు కోరారు. మాడల్ స్కూల్ లో కుల వివక్షత నిజమేనని తాము ప్రత్యక్షంగా బ్లాక్ బోర్డ్ ల మీద చూసినట్టు కమీషన్ సభ్యులు తెలిపారు. ప్రిన్సిపాల్ మీద చట్టపరమైన చర్యలకు కమీషన్ సిఫారసు చేస్తున్నట్లు, మధ్యాహ్న భోజన భాద్యులు, పిఈటీ మీద చర్యలకు సిఫారసకు ప్రకటించారు.

ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ను వెంటనే సస్పెండ్ చేయాలి..పిఈటీ ను బదిలీ చేయాలి:కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత

తరగతి గదులలో నిల్చోబెట్టి కులాల వారిగా అటెండెన్స్ తీసుకుని బ్లాక్ బోర్డు మీద వేయడం చట్టరీత్యా నేరమని విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రిన్సిపాల్ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.మోడల్ స్కూల్ లో ఇస్టానుసరంగ ప్రవర్తించే ప్రిన్సిపాల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని కమీషన్ సభ్యులకు దాసరి వినతిపత్రాన్ని అందజేశారు. విద్యార్థినులను మోకాళ్ళ మీద కొడుతున్న పిఈటీ మీద చర్యలు తీసుకుని బదిలీ చేయాలన్నారు.
ఈకార్యక్రమంలో ఎంపీపి కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, డీఆర్ఠీఏ డీపిఎం వంగ రవీందర్, తహశీల్దార్ సయ్యద్ ముబిన్ అహ్మద్, ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి, సూపరెండింట్ ఖాజా మొయినుద్దీన్, సర్పంచ్ ముప్పిడి వెంకట నరసింహారెడ్డి, విద్యాకమిటీ చైర్మన్ పూదరి అరుణ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, బిఎస్పీ నాయకులు ఎనగందుల శంకర్, బోయిని బాబు, నిలిగొండ బిక్షపతి ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.