ఆదిదేవుని ప్రసాదం 12,500 దక్కించుకున్న నాగలింగం.

ఐదు రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుని ప్రసాదం దక్కించుకోవడం పుణ్యఫలం.
తాండూరు సెప్టెంబర్ 4(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూర్ గ్రామంలోని శివాలయం ప్రాంగణంలో ప్రతిష్టాపించి భక్తిశ్రద్ధలతో ఐదు రోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథుని ప్రసాదం (లడ్డు) గ్రామానికి చెందిన ఎల్ నాగలింగం వేలంపాటలో రూపాయలు12 500 కు దక్కించుకున్నారు.గత నెల31న వినాయక చవితి పురస్కరించుకొ ని దేవనూర్ గ్రామంలోని శివాలయం వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకున్ని భక్తిశ్రద్ధలతో ప్రతిష్టాపించారు.ఈ సందర్భంగా వినాయకునికి విశేష పూజలు నిర్వహించారు. వివిధ పండ్లు పూలతో ప్రత్యేకంగా గణనాథున్ని అలంకరించి గ్రామ ప్రజలకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రత్యేకంగా అలంకరించిన వినాయకుడిని దర్శించుకు నేందుకు గ్రామ ప్రజలు తరలివచ్చి గణనాథున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక మంటపానికి వచ్చిన భక్తులకు వేద మంత్రోచరణతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.శివాలయంలో కొలువుదీరిన బోజ్ఞగణపయ్యను దర్శించుకుంటే విఘ్నాలు తొలగిపోయి విజయాలు చేకూర్తాయని గ్రామ ప్రజల విశ్వసనీయమైయిన నమ్మకం. ఆదివారం నిమజ్జనం సందర్భంగా శివాలయంలో ప్రతిష్టాపించిన వినాయకుని ప్రసాదాన్ని కైవసం చేసుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. దీంతో గ్రామానికి చెందిన ఎల్ నాగలింగం వినాయక ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రోజులపాటు ఉదయం సాయంత్రం భక్తిశ్రద్ధలతో విశేష పూజలు అందుకున్న వినాయకుని ప్రసాదం దక్కించుకుంటే అన్ని కార్యక్రమాల్లో విజయం తమ సొంతం అవుతుందని నమ్మకంతో వినాయక ప్రసాదాన్ని వేలంపాటలో తమ సొంతం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో జై బోలో గణేష్ మహరాజ్ కీ జై అంటూ గణనాథుని గంగమ్మ వాడికి సాగనంపారు.ఈ కార్యక్రమానికి శివాలయం భజన మండలి భక్తులు మరియు పెద్దలు ఎల్ రాములు, బసవరాజ్, నాగలింగం, రామలింగం ,బూదెవప్ప, సి రాజేందర్ ,ఆంజనేయులు యువకులు తదితరులు పాల్గొన్నారు