ఆదిలాబాద్‌లో ఇద్దరి ఆత్మహత్య

ఆదిలాబాద్‌: జిల్లాలో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. మామడ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన బర్మ రాజ్‌కుమార్‌ కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకోగా, పొన్కల్‌ గ్రామానికి చెందిన జక్కుల భూమేష్‌ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. వీరిరువురూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.