ఆదిలాబాద్ జిల్లాలో పొంగిన వాగు: స్తంభించిన రాకపోకలు
బెజ్జూరు: ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కృష్ణపల్లి సమీపంలోని పెద్దవాగు పొంగడంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి వాగు పొంగిపోర్లుతోంది. వాగు అవతల గ్రామాలైన కృష్ణపల్లి, రేచిని, ఇందిగ్రాం, సోమెని, గెర్రెగూడ, కొత్తగెర్రె, మొగవెల్లి, కొత్తమొగవెల్లి, బండలగూడ, నాగపల్లి, ఇప్పలగూడ… తదితర గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఆదివారం బెజ్జూరులో వారాంతపు సంతకు రాని పరిస్థతి నెలకొంది.