ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్ గారి చేతుల మీదుగా అమన్ ఫౌండేషన్ అదిలాబాద్ లోగో ఆవిష్కరణ.

జనం సాక్షి ఉట్నూర్.
ఆదిలాబాద్:  ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో  జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్ రాథోడ్  గారి చేతుల మీదుగా అమన్ ఫౌండేషన్ లోగో ఆవిష్కరించడం జరిగింది. ఫౌండేషన్ సభ్యులు జనార్ధన్ గారికి గారికి జ్ఞాపికను అందజేసి శాలువ తో సన్మానించి భవిష్యత్తులో చేసే సేవా కార్యక్రమాలు గురించి చెప్పడం జరిగింది ఈ ఫౌండేషన్ పేదలకు అన్ని విధాలుగా సేవలు అందిస్తూ అదేవిధంగా యువత లో  విద్య, ఆరోగ్యం మానవత్వం పెంపొందించే విధంగా ఫౌండేషన్ పని చేస్తుందని తెలిపారు. చైర్మన్  గారు మాట్లాడుతూ అమన్  ఫౌండేషన్ ద్వారా మీరు చేసే సేవ కార్యక్రమాలకు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తారని అన్నారు. సేవా కార్యక్రమాలు యువత ముందు రావాలని కోరారు. కార్యక్రమంలో అమన్ ఫౌండేషన్ అధ్యక్షులు అర్ఫాద్ ఖాన్,  ఉపాధ్యక్షులు పరమేశ్వర్ కొలెట్కర్, జాయింట్ సెక్రటరీ షేక్ కలీం, తదితులున్నారు.
Attachments area