ఆదివాసి గిరిజన సమ్మేళనం

ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్

రాజన్నసిరిసిల్లబ్యూరో, సెప్టెంబర్ 15, (జనం సాక్షి.) సెప్టెంబర్ 17న హైదరాబాదులో నిర్వహించే ఆదివాసీ గిరిజన సమ్మేళనం కార్యక్రమం పోస్టర్ ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో ఆవిష్కరించారు.
సెప్టెంబర్ 17న హైదరాబాదులో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొమరం భీమ్ ఆదివాసీ భవనం, సేవాలాల్ బంజారా భవనాన్ని ప్రారంభిస్తారని, కార్యక్రమానికి జిల్లా నుంచి ప్రత్యేకించిన బస్సులలో ఎస్టీ ఉద్యోగస్థులు, ప్రజాప్రతినిధులు, సభ్యులను , ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులు వెళ్లనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో నిర్మించిన కొమరం భీమ్ ఆదివాసీ భవనం, సేవాలాల్ బంజారా భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని, ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో ఎస్టీ ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథo, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ ఉపేందర్ , ఆర్ అండ్ బి కార్యనిర్వహక ఇంజనీర్ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.