ఆదివాసీలకు అండగా ఉంటాం బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించండి బీఎస్పీ నాయకులు మహేందర్
రుద్రంగి ఆగస్టు 9 (జనం సాక్షి)
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా రుద్రంగి గ్రామ శాఖ అధ్యక్షులు వేములవాడ నియోజక వర్గ సోషల్ మీడియా ఇంఛార్జి కాదాసు మహేందర్ అధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ప్రపంచ ఆదివాసీ ముద్దు బిడ్డలారా మీకు బహుజన్ సమాజ్ పార్టీ తరుపున ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది.గత 70సంవత్సరాలుగా అధికారంలో వున్న ఏ పార్టీ కూడా ఆదివాసీల బాగోగులు పట్టించుకోలేదని మీయొక్క పొడు భూములను,ఇండ్లను ద్వంసం చేస్తున్న ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆదివాసీల మీద దాడులు ఎక్కువ అయ్యాయని అలాగే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా”అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వేలాది మందితో కలిసి వెళ్ళి వారికి మద్దతు తెలియజేయడం జరిగింది..కావున రానున్న రోజుల్లో మీరు బహుజన్ సమాజ్ పార్టీకి అండగా నిలిచి రానున్న ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటు ను ఏనుగు గుర్తుపై వేసి బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని కోరుకుంటూ రుద్రoగి బహుజన్ సమాజ్ పార్టీ మండల పక్షాన ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దర్శనం గంగాధర్, వేములవాడ నియోజక వర్గ కోశాధికారి దయ్యాల ఉదయ్,మండల ప్రధాన కార్యదర్శి దేశవేని బూమేష్, సెక్టార్ కార్యదర్శులు ఎనుగందుల సతీష్,సుంచు హరీశ్ తదితరులు పాల్గొన్నారు.