ఆదివాసీల పట్ల నిర్లక్ష్యమెందుకో..
ఆదిలాబాద్‌్, జూలై 30 : గిరిజన ప్రాంతాలలో ఆదివాసుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆదివాసులు ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వామన్‌రావు, విటల్ ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలి గిరిజనులు మృతి చెందుతున్న వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఎన్నో నిధులు మంజూరు అవుతున్న గిరిజనుల దరికి చేరక పూర్తి హృదా అవుతున్నాయని అన్నారు. ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలలో మౌలిక అవసతులు లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రాథమికస్థాయిలో విద్యార్థులకు ప్రతిష్టమైన విద్యా అందించాలని వారు డిమాండ్ చేశారు. అగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని అన్ని పాఠశాలలో నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.