ఆదివాసీ గిరిజన సమ్మేళనానికి తరలిన గిరిజనులు
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు సందర్భంగా శనివారం నాడు హైదరాబాదులోని ఎన్ .టి .ఆర్ .స్టేడియంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాల్గొనే ఆదివాసీ గిరిజన సమ్మేళనం బహిరంగ సభకు జిల్లా నుండి వెయ్యి మంది గిరిజన ప్రతినిధులు 22 బస్సులలో బయలుదేరడం జరిగింది. కలెక్టరేటు నుండి 2 బస్సులలో గిరిజన ప్రభుత్వ ఉద్యోగులు, ఒక బస్సులో ప్రజాప్రతినిధులు, తుర్కపల్లి మండలం నుండి 5, బొమ్మల రామారం మండలం నుండి 5, బీబీనగర్ మండలం నుండి 3, నారాయణపురం మండలం నుండి 6 బస్సులలో బయలుదేరినారు.
కలెక్టరేటు కార్యాలయం నుండి బయలుదేరిన బస్సుకు ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీతారెడ్డి ప్ర్రారంభించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టరు పమేలా సత్పతి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి మందడి ఉపేందర్రెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భూక్య నాయక్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.