ఆదివాసుల పై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
కడెం జూన్ 08( జనం సాక్షి) బహుజన కమ్యూనిస్టు పార్టీ (bcp) ఉమ్మడి జిల్లా కమిటీ భూక్యా రమేష్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఆదివాసుల పై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
బహుజన కమ్యూనిస్టు పార్టీ డిమాండ్……. దండేపల్లి మండలం కోయ పోచ గూడా కు చెందిన 12 మంది గిరిజన మహిళను తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం సిగ్గుచేటు ఒక దిక్కు రాష్ట్రప్రభుత్వం సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని దరఖాస్తులు తీసుకొని నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వాటి ఊసు లేదు కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ జీవిస్తున్న గిరిజనులపై దాడి చేసి కేసులు పెట్టి జైలుకు పంపడం దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి వ్యవసాయ సీజన్ ప్రారంభమైన తరుణంలో ఫారెస్ట్ అధికారులు సాగు దారులపై ఎక్కడికక్కడ దాడులు చేసినా ఊరుకునేది లేదని గిరిజనులు ఐక్యత ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలనే పిలుపునిస్తూ ఫారెస్ట్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా బహుజన కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని వారు సాగు దారులపై ఇలాంటి బెదిరింపులు ఇబ్బందులకు గురి చేసిన ఆదివాసీలు గిరిజనులు తోడుగా ఉంటూ బహుజన కమ్యూనిస్టుపార్టీ అధ్వర్యంలో అందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు పసుపుల ఎంకన్న బహుజన కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శిభూక్యా రమేష్ బహుజన కూలి రైతు సంఘం మండల నాయకులు గంగా రాజాం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.