ఆధునికి పరికరాలను వాడాలి
కరీంనగర్: మంథని మండలంలోని పంటలసాగులో ఆధునిక యంత్రాలను ఉపయోగించుకుంటే రైతులు మంచి ఫలితాలు పొందవచ్చని వ్యవసాయ అధికారులు సూచించారు. ఆధునికి యంత్రాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. డ్రమ్సీడర్ యంత్రాన్ని క్షేత్రప్రదర్శనలో వుంచారు. ఈ కార్యక్రమంలో ఆత్మ డిప్యూటీ డైరెక్టర్లు సునీత, ఉష, సుధాకరరాజు, రఘోత్తమ రెడ్డి వ్యవసాయశాస్త్రవేత్త వెంకన్న ఏడీఏ విజయభాస్కర్, వ్యవసాయాదికారి అలివేణి తదితరులు పాల్గొన్నారు.