ఆధ్యాత్మికవేత్త భయ్యాజీ ఆత్మహత్య

కాల్చిచంపారనే అనుమానాలు

భోపాల్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): మధ్యప్రదేశ్‌కు చెందిన ఆధ్యాత్మిక వేత్త భయ్యూజీ మహరాజ్‌ మంగళవారంనాడు అనుమానాస్పద స్థితిలో మరణించారు. తనను తాను కాల్చుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్టు చెబుతుండగా, ఆయనను కాల్చిచంపి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భయ్యూజీ మహారాజ్‌ను హుటాహుటిన ఇండోర్‌లోని ముంబై ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు. ఆధ్యాత్మికవేత్తగా మహారాష్ట్రలో మంచి ఫాలోయింగ్‌ ఉన్న భయ్యూజీకి ఇటీవల నర్మదా నదీ ప్రక్షాళన బోర్డులో భాగంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం కేబినెట్‌ ¬దా కల్పించింది. భయ్యూజీ మహరాజ్‌ 17 ఏళ్లగా పలువురు కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. కొద్దికాలం క్రితమే ఆయన భార్య కూడా కన్నుమూసింది. 2011లో అన్నాహజారే లోక్‌పాల్‌ బిల్లుపై నిరాహార దీక్ష చేపట్టినప్పుడు మరోసారి భయ్యూజీ పేరు ప్రచారంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు అన్నా నిరాకరించడంతో అన్నాకు చెప్పి ఒప్పించేందుకు అప్పట్లో విలాస్‌రావు దేశ్‌ముఖ్‌…భయ్యూజీని ముందుకు తీసుకువచ్చారు.