ఆధ్యాత్మిక వికాసానికి నిలయాలు దేవాలయాలు హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ గారు.
సైదాపూర్, జనం సాక్షి,సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో, పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఈరోజు స్థానిక,శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ గారి కి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ,దేవాలయాలు మనిషి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేస్తాయని తద్వారా ప్రజలు సంస్కృతి, సాంప్రదాయాలు పాటించుకుంటూ వారి యొక్క వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకొని మెరుగైన సమాజం కోసం కృషి చేస్తారని అందుకే పెద్దలు ప్రతి ఊర్లో గుడికి,బడికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు.దుద్దెనపల్లి గ్రామంలో ముదిరాజ్ కులస్తులు, ప్రజలు, పిల్లలు ,పెద్దలు ఆనందోత్సవాలతో శ్రీ పెద్దమ్మ తల్లి పండుగను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ యుగంధర్ ఉప సర్పంచ్ హరీష్ గ్రామ ఎంపీటీసీ, తదితరులు పాల్గొన్నారు