ఆన్‌లైన్‌లో ఐపీఎల్‌ వస్తువుల వేలం

బెంగళూర్‌ : ఐపీఎల్‌ 6కు మరింత ఊపు తెచ్చేందుకు కొత్త ప్రణాళికలు సిద్దం చేశారు. ఇందులో భాగంగా ఐపీఎల్‌ వస్తువులను ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నారు. కలెక్టోబిలియా .కామ్‌ అనే సంస్థ ప్రతి రోజు ఓ కొత్త వస్తువును అభిమానులకు అందుబాటులోకి తీసుకురానుంది. వారం రోజుల పాటు ఈ వేలం జరుగుతుంది. ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ వ్యక్తిగతంగా సంతకం చేసిన జెర్సీ ,ముంబై జట్టు సంతకాలు చేసిన టీమ్‌ జెర్సీ ….ఇలా రకరకాల వస్తువుల వేలానికి రానున్నాయి.