ఆన్ లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
హత్నూర (జనం సాక్షి)
ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులు సూచించారు.మండలంలోని కాసాల దౌల్తాబాద్ తదితర గ్రామాల్లో శనివారం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.సామాజిక మాధ్యమాల్లో రోజు రోజుకు నేరాల సంఖ్య పెరిగిపోతోందని వారన్నారు.ప్రజలు వారి వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దని చెప్పారు.గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మోసపూరితమైన మాటలతో నమ్మించి ఆన్లైన్ ద్వార నగదు దొంగిలిస్తారని వారు సూచించారు.ఆధార్ నెంబర్,బ్యాంకు ఖాతా నెంబరు,ఒటిపి లాంటి వివరాలు ఎవరడిగినా చెప్పకూడదని వారన్నారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ విభిన్న రకాల నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల మాయలో పడి మోసపోవద్దని వారు సూచించారు.