ఆప్‌ ఎంపీ వీడియో పోస్ట్‌పై దుమారం

3

– ఉభయసభల్లో గందరగోళం

న్యూఢిల్లీ,జులై 22(జనంసాక్షి):  ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్‌ మాన్‌ వీడియో వ్యవహారంపై పార్లమెంట్‌ ఉభయ సభలు శుక్రవారం దద్దరిల్లాయి. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని అధికార బీజేపీ, అకాలీదళ్‌ సభ్యులు పట్టుబట్టారు. దీంతో ఉభయసభల్లోనూ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. సభా కార్యక్రమాలు స్తంభించిపోవడంతో పార్లమెంట్‌ ఉభయ సభలు తొలుత  మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. తరవాత లోక్‌సభ సోమవారానికి వాయిదా పడగా, రాజ్యసభ మధ్యాహ్నం రెండున్నర వరకు వాయిదా పడింది. పార్లమెంట్‌ పరిసరాలను, లోనికి వెల్లే మార్గాలను భద్రతా ఏర్పాట్లను మాన్‌ తన సెల్‌ఫోన్‌ ద్వారా చిత్రీకరించి ఎంపి మాన్‌ నెట్‌లో పోస్ట్‌ చేశారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన పార్లమెంట్‌ భద్రతకు ఇది విఘాతం లిగించేదిగా ఉందని సభ్యులు తీవ్రంగా పరిగణించారు. దీంతో భగవంత్‌ మాన్‌ తీసిన వీడియో తీవ్రవాదుల చేతుల్లో పడితే ఎవరు బాధ్యత వహిస్తారని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వి, హరసిమ్రత్‌ బాదల్‌ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తప్పనిసరిగా దర్యాప్తు విచారించాలని, పార్లమెంట్‌ కార్యకలాపాలను వీడియో తీయడం వెనుకున్న ఉద్దేశాన్ని వెల్లడి చేయాలని డిమాండ్‌ చేశారు. తన చర్యను భగవంత్‌ సమర్థించుకున్నారని, మరోసారి ఇలా చేస్తే చర్యలు తప్పవని రాజ్యసభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ హెచ్చరించారు. మరోవైపు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఎదుట హాజరై భగవంత్‌ వివరణ ఇచ్చారు. జీవో అవర్‌లో విపక్షాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చూపించేందుకే వీడియో తీశానని భగవంత్‌ చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చలు లక్కీ డ్రా మాదిరిగా జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ భద్రతకు తాను భంగం కలిగించలేదన్నారు. జీవో అవర్‌ లో చేసిన వీడియోను ఫేస్‌బుక్‌ లో పోస్ట్‌ చేయడంతో భగవంత్‌ వివాదంలో చిక్కుకున్నారు. అయితే లోక్‌సబళో ఈ దుమారం కొనసాగినా తరవాత సభను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సోమవారానికి వాయిదా వేశారు. భద్రతా వ్యవస్థను దాటుకుంటూ పార్లమెంట్‌లోకి వెళ్లడంపై భగవంత్‌ వీడియో తీసి, సోషల్‌విూడియాలో పోస్టు చేసిన విషయం తీవ్రంగ ఆపరిగణించాలని రాజ్యసభలో కూడా ఎంపిలు డిమాండ్‌ చేశారు. అతడిని తక్షణం సస్పెండ్‌ చేయాలన్నారు.  ఈ విషయంపై పార్లమెంట్‌లో శుక్రవారం అన్ని పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. తీవ్ర గందరగోళం నడుమ.. భగవంత్‌పై లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ చర్యలు చేపట్టి.. సమన్లు జారీ చేశారు. వీడియో వివాదంపై రాజ్యసభలో కూడా చర్చ జరిగింది. భగవంత్‌మాన్‌ చర్యలను కాంగ్రెస్‌ పార్టీ తప్పుబట్టింది. చట్ట ప్రకారం భగవంత్‌ మాన్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ సూచించింది. భగవంత్‌మాన్‌ ఒకసారి కాకుండా మళ్లీ చిత్రీకరిస్తానని చెప్పడమేంటని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రశ్నించారు. చేసిన తప్పు మళ్లీ చేస్తానన్న ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సభే నిర్ణయించాలని పేర్కొన్నారు. ఆమ్‌ ఆద్మీ లోక్‌ సభ సభ్యుడు భగవంత్‌ మాన్‌  కారులో పార్లమెంట్‌ లోపలికి వెళ్తున్న సమయంలో దారులు? సెక్యూరిటీ పాయింట్లు సహా కీలక ప్రాంతాలను ఆయన సెల్‌ ఫోన్‌ లో  రికార్డు చేశారు. మొత్తం 12 నిమిషాలున్న వీడియోను ఆయన ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ చేశారు. దీనిపై సోషల్‌ విూడియాలో విమర్శలు వచ్చినా? తాను చేసిన దాంట్లో తప్పేం లేదంటున్నారు ఆప్‌ ఎంపీ. ఆప్‌ ఎంపీ తీరును ఇతర పార్టీల నేతలు తప్పుబడుతున్నారు. పార్లమెంట్‌ ను అవమానించేలా ప్రవర్తిస్తున్న ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. బాధ్యత లేకుండా ప్రవర్తించడం కరెక్ట్‌ కాదంటున్నారు.వీడియో ఇష్యూపై  రిపోర్ట్‌ ఇవ్వాలని పార్లమెంట్‌ సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌.