ఆమ్‌ ఆద్మీ పార్టీలో ఆగని సంక్షోభం

ఢిల్లీ, మార్చి 19 : ఆమ్‌ ఆద్మీ పార్టీలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రశాంత్‌ భూషణ్‌, యోగేంద్ర యాదవ్‌ తమ వాదనకే కట్టుబడి ఉన్నట్లు ఆ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు వారు లేఖ రాసినట్లు సమాచారం. దాంతో కేజ్రీవాల్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలియవచ్చింది. మరోవైపు పార్టీ అంతర్గత అంబుట్‌మెన్‌ ఎల్‌. రాందాస్‌ను కూడా తప్పించాలని కేజ్రీవాల్‌ భావిస్తున్నట్లు సమాచారం.

బెంగుళూరు నుంచి ఢిల్లీ వచ్చిన కేజ్రీవాల్‌ రెండు రోజులు పార్టీ సమస్యలు పరిష్కారం దిశగా సాగుతున్నాయన్న సంకేతాలు కనిపించాయి. అయితే ప్రశాంత్‌ భూషణ్‌, యోగేంద్రయాదవ్‌ ద్వయంపై కేజ్రీవాల్‌ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. వారు కూడా తమ పట్టు నుంచి వెనక్కి తగ్డేది లేదని సమాచారం. దాంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు పరిస్థితి ఉంది.