ఆయా పోస్టుకు నోచుకోని తొర్రూరు అంబేద్కర్ నగర్ అంగన్వాడి సెంటర్

 తొర్రూర్ 19 ఆగస్టు (జనంసాక్షి )      పట్టణ కేంద్రం లోని అంబేద్కర్ నగర్ లో గల అంగన్వాడి సెంటర్ ఒకటి లో గత 12 సంవత్సరాల నుండి ఆయా పోస్టుకు నోచుకోలేకపోయింది. గత 12 సంవత్సరాల నుండి అంగన్వాడీ టీచర్ అయిన
జె, లలిత 2010 జూన్ 10 తేదీ నుండి ఇప్పటివరకు అంగన్వాడి టీచర్ అయినా లలిత  టీచర్ పోస్టును మరియు ఆయా పోస్టును ఒక్కరే నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ నగర్ లోని అంగన్వాడి కేంద్రంలో ప్రస్తుతం 15 మంది పిల్లలు, 11 మంది గర్భిణీలు, 12 మంది బాలింతలు ఉన్నారు. అయినప్పటికీ అంగన్వాడి టీచర్ అయిన లలిత వారందరికీ వంట చేసి పెట్టడం, గర్భిణీ స్త్రీలకు పాలు పోయడం గుడ్లు వండి పెట్టడం అంగన్వాడి పిల్లలకు వంట చేయడం టీచర్ గా తన విధులు నిర్వహించడం అంగన్వాడి సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లకు వెళ్లడం అలా వెళ్లిన సమయంలో అంగన్వాడి సెంటర్ ని మూసి వేయవలసి వస్తుంది. పిల్లలకు గర్భిణీలకు బాలింతలకు వంట చేసేటప్పుడు కూరగాయలు మరియు గ్యాస్ బిల్లులు గత ఏడు సంవత్సరాల నుండి అంబేద్కర్ నగర్ అంగన్వాడి సెంటర్ కు రావడం లేదు అంతేకాకుండా ఈ అంగన్వాడి సెంటర్ కు ఆయా లేకపోవడం వలన అంగన్వాడీ టీచర్ అయిన లలిత అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నది. అంగన్వాడి సెంటర్ ప్రతిరోజు ఓపెన్ ఉండాలి కాబట్టి అంగన్వాడి టీచర్ కు ఏమైనా గాని ప్రతిరోజు అంగన్వాడి సెంటర్ ఓపెన్ చేసి ఉండాలి కాబట్టి తొర్రూర్ అంబేద్కర్ నగర్ లో గల అంగన్వాడి సెంటర్ కు ఆయా పోస్టు పూర్తిచేయాలని వారు తెలిపారు.