ఆయిల్ ఫామ్ పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు

మల్దకల్ జూన్ 8 (జనం సాక్షి) మండల పరిధిలోని మల్లెందొడ్డి గ్రామంలో రైతులకు వానాకాలం -2022 పంటల సాగు,ఆయిల్ పామ్ పంటల గురించి అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి కే.రాజశేఖర్ హాజరై మాట్లాడుతూ వానాకాలంసాగు పంటలలో భాగంగా రైతులు వరిసాగు లో వెదజల్లే పద్ధతి ,పచ్చిరొట్ట ఎరువులు,భాస్వరం కరిగించే బ్యాక్టీరియా గురించి ఎరువులను ధప ధపాలుగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస ఆచారి మాట్లాడుతూ ఆయిల్ పామ్  పంట సాగు మిరపలో రోగనిరోధక గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సర్పంచ్ జి . వెంకటేశ్వర్ రెడ్డి,ఎంపీటీసీ టి . పరుశరాముడు, ఉపసర్పంచ్ ఆంజనేయులు,మాణిక్యరెడ్డి, ఏఈఓ సుజాత,ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ చైర్మన్ శశిధర్ గౌడ రైతులు పాల్గొన్నారు.